కలం, వెబ్ డెస్క్: ఒకే వేదికపై హీరో నాగార్జున(Nagarjuna), మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మెరిశారు. అదెక్కడో కాదు గ్లోబల్ సమ్మిట్ లో. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు హీరో నాగార్జున గెస్ట్ గా వచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దానం నాగేందర్ లతో కలిసి నాగార్జున సమ్మిట్ కు వచ్చాడు. వీరంతా కలిసి డిజిటల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే వీరి కంటే ముందే అక్కడకు వచ్చిన మంత్రి కొండా సురేఖ ఆదివాసీ కళాకారులతో డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు.
ఆమె ఒక మంత్రి స్థాయిలో ఉన్నా సరే కావాలనే రేవంత్(Revanth Reddy) వెంట లేరని తెలుస్తోంది. ఆమె కూతురు రేవంత్ మీద ఆరోపణలు చేసినప్పటి నుంచే ఆమెను దూరంగా ఉంచుతున్నారు. పైగా ఇప్పుడు హీరో నాగార్జున(Nagarjuna)తో కలిసి డిజిటల్ విగ్రహం ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆమెను దరిదాపుల్లోకి రానివ్వలేదంట. నాగార్జున ఫ్యామిలీపై, సమంతపై అప్పట్లో మంత్రి చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత కోర్టులో నాగార్జున కేసులు వేయడం, మంత్రి క్షమాపణలు చెప్పడంతో రీసెంట్ గానే ఆ కేసును వాపస్ తీసుకోవడం జరిగాయి. అప్పటి నుంచి కొండా సురేఖ(Konda Surekha)పై నాగార్జున కోపంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు మొదటిసారి ఒకే వేదిక వద్దకు వచ్చినా.. ఒకరికొకరు ఎదురు పడకుండా ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న గవర్నర్.. ముఖ్యమంత్రి స్వాగతం
Follow Us On : X(Twitter)


