కలం, వెబ్ డెస్క్: రవితేజ (Ravi Teja) రూటు మార్చట్లేదు. అవే రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తున్నాడు. పైగా ఇప్పుడు చిరంజీవి, ప్రభాస్ తో పోటీ ఏంటి. ఆయన సినిమాను సోలోగా రిలీజ్ చేసుకుంటేనే ఎవరూ చూడట్లేదు. రవితేజ పది ప్లాపులు ఇస్తే.. ఒక్క హిట్ కొడుతున్నాడు. ఫ్యాన్స్ మీద కనికరమే లేకుండా రొటీన్ కథలతో సినిమాలు చేసి.. ఏడాదికి మూడు వదులుతున్నాడు. రవితేజ సినిమాలకు కామన్ ఆడియన్స్ వెళ్లడమే తగ్గించేశారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే మొదటి రెండు రోజులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతికి తన మూవీని తెస్తున్నాడు. చాలా కాలం తర్వాత మంచి డైరెక్టర్ కిషోర్ తిరుమలతో సినిమా చేస్తున్నాడు.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ టైటిల్ తోనే భార్య, భర్తల మధ్య ఉన్న రిలేషన్ నేపథ్యంలో మూవీ చేస్తున్నాడని అర్థం అవుతోంది. ఒకవేళ హిట్ అయితే అంతో ఇంతో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్న మూవీ ఇది. కాబట్టి సోలోగా రిలీజ్ చేసుకుంటే బాగుండేది. సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ వస్తోంది. ఇటు చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పోటీ పడుతోంది. సంక్రాంతి మొత్తం ఆ రెండు సినిమాల హవానే కనిపిస్తోంది. రవితేజ (Ravi Teja) మూవీపై పెద్దగా హైప్ కూడా రావట్లేదు. ఆ వేవ్ లో రవితేజ మూవీ కొట్టుకుపోయేలా కనిపిస్తోంది.
కంటెంట్ ఉన్న సినిమాను సోలోగా రిలీజ్ చేసుకుంటేనే బెటర్. పోటీ వాతావరణంలో ఆయన మూవీకి ఇంపార్టెన్స్ ఉండదు. నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్లు అడ్జస్ట్ చేయడమే కష్టం. రవితేజ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు పెద్దగా రావు. అప్పుడు ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. మిగిలిన నాలుగు సినిమాల కంటే రవితేజ మూవీకే తక్కువ కలెక్షన్లు వస్తే పరువు పోతుంది. ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ కూడా పడిపోద్ది. రవితేజ కెరీర్ కే నష్టం. కాబట్టి సంక్రాంతిని వదిలేసి సోలోగా వస్తే బెటరేమో.
Read Also: వాట్సాప్ కనుమరుగు కానుందా?
Follow Us On: Youtube


