Mobile Popup Ad
Mobile Popup Ad

FY 2025-26లో రూ.685 కోట్ల ఆస్తిపన్ను వసూలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని కోర్ అర్బన్ ఏరియా బయట ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో ఆస్తిపన్ను వసూళ్లు (Property Tax Collections) గణనీయంగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.613 కోట్ల 38 లక్షల ఆస్తిపన్ను వసూలు కాగా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 685 కోట్ల 4 లక్షలు ఆస్తి పన్ను వచ్చినట్లు రాష్ట్ర పురపాలక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 133 పట్టణ, నగర పాలికల్లో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 2025-26లో సుమారు రూ. 68 కోట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్‌ కార్పరేషన్లలో ఆస్తిపన్ను (Property Tax) ఆదాయం పెరిగింది. ఇక కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండలో ఆస్తి పన్ను తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 64 స్థానిక సంస్థల్లో ఆస్తిపన్నుల వసూలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాల్టీల్లో 100 శాతం ఆస్తిపన్ను వసూలైందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన 21 మున్సిపాల్టీల్లో గతంతో పోలిస్తే ఆస్తిపన్ను ఆదాయం పెరగటం గమనార్హం.

Read Also: ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదాంతం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>