కలం, వెబ్ డెస్క్: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడినవాళ్లకు 5వేల డాలర్లు జరిమానా విధించనుంది. అంటే ప్రస్తుత రూపాయి మారకంతో పోలిస్తే దాదాపు రూ.45లక్షలు అక్రమ వలసదారుల నుంచి వసూలు చేయనుంది. ఈ మేరకు బిగ్ బ్యూటిఫుల్ చట్టం (Big Beautiful Bill)లో పొందుపర్చింది. వలస చట్టాలను అతిక్రమించినందుకు విధించే జరిమానాకు ఇది అదనం.
అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన 14 ఏళ్లకు పైబడిన వాళ్లతోపాటు, వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నవాళ్లు, వీసాకు దరఖాస్తు ప్రాసెస్ లో ఉన్నవాళ్లకూ బిగ్ బ్యూటిఫుల్ చట్టం (Big Beautiful Bill) చట్టం కింద జరిమానా వేస్తారు. కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా దేశమంతటా ఇది వరిస్తుంది. ఎవరు ఎక్కడ బోర్డరు దాటినా, ఎక్కడ నివసిస్తున్నా, వాళ్ల మీద ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ కేసులు ఉన్నా ఈ చట్టం అమలు చేస్తారు. జరిమానా చెల్లించకపోతే సదరు అక్రమ వలసదారు అమెరికా ప్రభుత్వానికి బాకీ పడినట్లుగా ప్రకటిస్తారు. భవిష్యత్తులో అతను తిరిగి అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు.
కాగా, అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండంతో మెక్సికో బోర్డరు నుంచి అక్రమంగా ప్రవేశిస్తున్న వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నవంబర్ లో ఇక్కడ అక్రమంగా సరిహద్దు దాటుతూ 7,300 మంది పట్టుబడినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. 1960 తర్వాత ఈ స్థాయిలో తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి అన్నారు. మరోవైపు సరిహద్దుల్లోనే కాకుండా లాస్ ఏంజెల్స్, చికాగో లాంటి నగర ప్రాంతాల్లోనూ అక్రమ వలసదారులను గుర్తించేందుకు అమెరికా హోమ్ సెక్యూరిటీ బృందం (డీహెచ్ ఎస్) తనిఖీలు చేస్తోంది.
Read Also: ఆయుధ ఎగుమతుల్లో భారత్ దుమ్ము లేపుతోంది –రాజ్‌నాథ్
Follow Us On: Facebook


