epaper
Friday, January 16, 2026
spot_img
epaper

లోకేశ్ డల్లాస్ టూర్‌పై వైసీపీ ట్రోల్స్

కలం వెబ్ డెస్క్:  ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రస్తుతం డల్లాస్‌లో పర్యటిస్తున్నారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా (Telugu Diaspora Meeting) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని లోకేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు. జగన్ తమ అధినేతను తప్పుడు కేసులో జైళ్లో పెట్టిస్తే ప్రవాసులంతా పెద్దఎత్తున మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రవాసాంధ్రులందరినీ తాము గుండెల్లో పెట్టుకుంటామని లోకేశ్ చెప్పారు.

సభ విజయవంతం అయ్యిందా?

ఈ సభ విజయవంతం అయ్యిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేశ్ (Nara Lokesh) అమెరికాలో పర్యటిస్తున్నారని చెప్పారు. అయితే వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో మాత్రం లోకేశ్ డల్లాస్ సభ డమాల్ అయ్యిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సభకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని.. హాలు మొత్తం ఖాళీగానే ఉందని వారు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లకుండా కేవలం లోకేశ్ వెళ్లడంతో డల్లాస్ లోని తెలుగువారు లైట్ తీసుకున్నారని వారు విమర్శిస్తున్నారు.

నేషనల్ డిబేట్‌పై ట్రోల్స్

ఇటీవల ఇండిగో సంక్షోభం సందర్భంగా కూడా లోకేశ్ అకారణంగా విమర్శలకు గురయ్యారు. నేషనల్ మీడియాలో నిర్వహించిన ఓ డిబేట్‌లో టీడీపీ నేత దీపక్ రెడ్డి(Deepak Reddy) మాట్లాడుతూ.. ఇండిగో సంక్షోభాన్ని లోకేశ్ చక్కదిద్దుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో అసలు ఇండిగో సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు లోకేశ్ ఎవరని సదరు నేషనల్ మీడియా జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. ఈ వీడియోలను కూడా వైసీసీ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఇలా వైసీపీ(YSRCP) సోషల్ మీడియాలో టీడీపీ మీద విరుచుకుపడుతోంది. ఇక టీడీపీ సోషల్ మీడియా సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. ఇటీవల జగన్ ప్రెస్‌మీట్‌పై టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

Read Also: నిన్నటి వరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరోలెక్క : సీఎం రేవంత్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>