కలం, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం(Kaleshwaram) కూలిందని ఇష్టమొచ్చినట్లుగా రేవంత్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దమ్ముంటే సిద్దిపేటకు రావాలని హరీశ్ (Harish Rao) సవాల్ విసిరారు. ‘రంగనాయక సాగర్‌లో బండకు కట్టి నిన్ను ఎత్తేస్తా.. నువ్వు మునుగుతావో.. తేలుతావో చూద్దాం. నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్లు.. నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్లు’ అని హరీశ్ రావు కౌంటర్ వేశారు. ఆదివారం సిద్దిపేట జల్లా చిన్నకోడూరు మండలంలో ఆయన పర్యటించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుని మాట్లాడారు.
ఇందిరమ్మ చీర చూసి సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థికి ఓటు వేయాలనే చిల్లర మాటలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) మానేయాలని హరీశ్ రావు(Harish Rao) హితవుపలికారు. ఈ మాటలతో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దన్నారు. ఒక్కో మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద బకాయిపడ్డ రూ.60 వేలు ఇచ్చి ఓటు అడగాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఓడిస్తేనే రైతులకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా డబ్బులు పడుతాయన్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు.
Read Also: కిషన్ రెడ్డి ఆరోపణలకు పీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On : X(Tiwtter)


