కలం, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 (Akhanda 2) వాయిదా పడ్డ సంగతి తెలిసిందే కదా. గతంలో ఎన్నడూ ఇలా విడుదలకు రెండు గంటల ముందు వాయిదా పడలేదు. ఫైనాన్షియల్ సమస్యల వల్ల కోర్టు ఆర్డర్లతో ఇలా వాయిదా పడింది సినిమా. ఇప్పుడు ‘ఈరోస్’ సంస్థకు ’14 రీల్స్ ప్లస్’ సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.52 కోట్లు సెటిల్ మెంట్ చేసుకునే పనిలో పడ్డారు. చాలా త్వరలోనే ఇది క్లియర్ అయ్యేలా ఉంది. ఈ లెక్కన ఈ నెలలో లేదంటే వచ్చే కొత్త ఏడాదిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్న బుక్ మై షోలో 2026లో రిలీజ్ డేట్ అని ఉంది. సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్ తో పాటు రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి, సినిమాలు రాబోతున్నాయి. ఇంకో రెండు చిన్న మూవీలున్నాయి.
కాబట్టి ఈ నెలలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారంట. అఖండ 2 (Akhanda 2)కు ఏ కొత్త డేట్ ను సెలెక్ట్ చేసుకున్నా అక్కడ ఉన్న సినిమాలకు ఇబ్బందులే. 12న వస్తే మోగ్లీ, సైక్ సిద్ధార్థ సినిమాలు నిండా మునగడం ఖాయం. పోనీ 25న సినిమాను రిలీజ్ చేస్తే ఆ డేట్ కు ఉన్న శంబాల, ఛాంపియన్ సినిమాలకు గట్టి దెబ్బ పడటం ఖాయం. అసలే శ్రీకాంత్ కొడుకు నాలుగేళ్ల తర్వాత ఛాంపియన్ తో వస్తున్నాడు. ఆది సాయికుమార్ చాలా ఏళ్ల తర్వాత శంబాలతో హిట్ కొట్టేలా ఉన్నాడు. కాబట్టి బాలయ్య వారిని వణికిస్తాడేమో అని భయపడుతున్నారు.
19న రిలీజ్ చేస్తే అప్పుడు అవతార్ 3 ఉంది కాబట్టి యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 12 లేదా 25 డేట్లు మాత్రమే బాలయ్యకు ఉన్నాయి. ఆ డేట్లలో దేన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ సినిమాల మీద అఖండ పిడుగు పడటం ఖాయం. అసలే అఖండ 2 మీద విపరీతమైన అంచనాలున్నాయి. మరి బాలయ్య ఆ చిన్న సినిమాలను వదిలేస్తాడా లేదంటే దయాదాక్షిణ్యాలు లేకుండా రిలీజ్ కు రెడీ అవుతాడా చూడాలి.
Read Also: వారణాసి మూవీకి మహేష్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా!
Follow Us on: Youtube


