epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇక్కడితో ముగిద్దాం.. పెళ్లిపై స్మృతి, పలాష్ ప్రకటన

కలం డెస్క్: ‘పలాష్‌(Palash Muchhal)తో పెళ్ళి రద్దయింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం’ అంటూ స్మృతి మందానా(Smriti Mandhana) పెట్టిన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందానా, మ్యూజిక్ కంపోజన్ పలాష్ ముచ్చల్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా వారి వివాహం వాయిదా పడింది. స్మృతి మందానా తండ్రి అనారోగ్యం బారిన పడటంతో వివాహాన్ని వాయిదా వేశారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ మరుసటి రోజే.. స్మృతిని పలాష్ చీట్ చేశాడని, వేరే కొరియోగ్రాఫర్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ చాలా వార్తలు వచ్చాయి. వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. అయితే ఎట్టకేలకు తాజాగా ఈ అంశంపై స్మృతి స్పందించింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దామని కోరింది. వివాహం రద్దయిందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్మృతి మందానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ షేర్ చేసుకుంది. అందులో ఏముందంటే..

వివాహం రద్దయింది: స్మృతి

వివాహ రద్దు నేపథ్యంలో వస్తున్న ఊహాగానాలు, ప్రచారాలపై స్మృతి(Smriti Mandhana) ఆవేదన వ్యక్తం చేసింది. “గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యం అని భావిస్తున్నాను. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని, అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించండి’’ అని కోరింది.

ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది

‘‘మేము మా దారిలో, మా వేగంలో ఈ విషయాన్ని సమీక్షించుకోవడానికి, ముందుకు సాగేందుకు కొంత స్థలం ఇవ్వండి. మన జీవితాల్లో ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. నా విషయంలో అది ఎప్పుడూ దేశం కోసం అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడటమే. నేను భారత్ కోసం ఆడుతూ, ట్రోఫీలు గెలుచుకోవడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. అదే నా దృష్టి, అదే నా లక్ష్యం. ఇప్పటి వరకు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగాల్సిన సమయం” అని రాసుకొచ్చింది స్మృతి.

నాకు చాలా బాధగా ఉంది: పలాష్

ఇదే అంశంపై పలాష్ ముచ్చల్ కూడా స్పందించాడు. అతడు కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. “నా వ్యక్తిగత సంబంధం నుంచి వైదొలగి, జీవితంలో ముందుకు సాగాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు ఎంతో పవిత్రమైన విషయంపై ప్రజలు ఆధారంలేని రూమర్స్‌కు అంత సులభంగా స్పందించడం నాకు చాలా బాధ కలిగించింది’’ అని తెలిపాడు.

‘‘ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన దశ, కానీ నా నమ్మకాలతోనే నేను దీన్ని గౌరవంగా ఎదుర్కొంటాను. నిర్ధారించని గాసిప్ ఆధారంగా మనం ఎవరినైనా తీర్పునివ్వడానికి ముందు మనం ఒక్కసారి ఆలోచించడం నేర్చుకోవాలి. మన మాటలు ఎవరినైనా ఎంత గాయం చేస్తాయో మనకు తెలియదు’’ అని పేర్కొన్నాడు.

కఠిన చర్యలు తీసుకుంటాం

‘‘ప్రపంచంలో చాలా మంది చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ విషయంపై ఆలోచించే సమయం ఇది. నా గురించి తప్పుడు, దూషణాత్మక కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై నా టీమ్ కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోనుంది. ఈ కష్ట సమయంలో నాతో నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని పలాష్ రాసుకొచ్చాడు.

Read Also: చిరంజీవితో అనిల్ రావిపూడి ప్రయోగాలు.. అవసరమా..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>