Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాకు స‌హ‌కారం.. గ‌ల్ఫ్ దేశాల‌కు ఇరాన్ తీవ్ర హెచ్చ‌రిక‌

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దని ఇరాన్ (Iran) అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు జరిగితే శత్రు స్థావరాలను భూస్థాపితం చేస్తామన్నారు. యుద్ధం ముగింపు, శాంతి స్థాప‌న గురించి మాట్లాడుతూ.. శాంతి నెలకొనాలంటే తమ నిబంధనలు పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. శత్రువులకు వత్తాసు పలికే వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ గుండా శ‌త్రు దేశాల నౌక‌ల‌ను అనుమ‌తించేది లేద‌ని మ‌సూద్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. ఇప్ప‌టికే రెండు భార‌త ఎల్‌పీజీ నౌక‌లు హర్మూజ్‌ను దాటాయి.

మ‌రోవైపు ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్ పేరిట ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేప‌డుతోంది. దుబాయ్‌లోని అమెరికా డ్రోన్ యూనిట్లపై డ్రోన్ల వ‌ర్షం కురిపిస్తోంది. కువైట్, దుబాయ్ పోర్టులపైనా దాడులు కొన‌సాగుతున్నాయి. ఇరాన్ దాడుల్లో ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో అమెరికా సైనికులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. మూడు అమెరికా నౌక‌లు సముద్రంలో మునిగిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>