కలం, వెబ్‌డెస్క్ : సింహాద్రి అప్పన్న స్వామి(Simhadri Appanna Temple)ని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వనం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో విరాట్ కోహ్లీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్పస్తంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనానంతరం కోహ్లీకి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వాదాలిచ్చారు. బేడా మండపంలో దేవస్థానం అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన విశాఖలో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను ఇండియన్ టీమ్ దక్కించుకుంది. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో విరాట్ అద్భతమైన ప్రదర్శనను కనబరిచారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అందుకున్నారు. అలాగే, విశాఖ మ్యాచ్ కు ముందు భారత్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేసిన విషయం తెలిసిందే.
Read Also: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
Follow Us on: Youtube


