మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గూగుల్ సెర్చ్ విషయంలో ఓ 14ఏళ్ల కుర్రోడు వెనక్కి నెట్టాడు. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. తాజాగా గూగుల్ విడుదల చేసిన ఇయర్ ఇన్ సెర్చ్ 2025 ఫలితాలు దీనినే చెప్తున్నాయి. ఆ 14ఏళ్ల యువకుడు ఎవరో కాదు.. ఐపీఎల్‌లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). అవును.. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు అతడితే. క్రికెట్ దిగ్గజాలైన ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కన్నా వైభవ్ గురించే ఎక్కువ మంది తెలుసుకున్నారు.
14 ఏళ్ల వయస్సులోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఈ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. ఈ ఏడాది ఐపీఎల్, ఇండియా ‘ఎ’ మ్యాచ్‌లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో అదిరిపోయే ప్రదర్శనలతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. అతడి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, ధైర్యవంతమైన షాట్ సెలెక్షన్, చిన్న వయసులోనే చూపిస్తున్న విశ్వాసం కారణంగా అభిమానులు అతడి గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నారు. దీంతో అతని పేరు ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది.
గూగుల్ విడుదల చేసిన Year in Search 2025 రిపోర్టు ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన వ్యక్తులలో వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత స్థానాలు కూడా యువ క్రికెటర్లకే దక్కాయి. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో నిలవగా, వారిని అనుసరించి అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు. ఐదో స్థానంలో టీమిండియా మహిళ ప్లేయర్ జెమీమా రోడ్రిక్స్ ఉన్నారు.
గూగుల్‌లో సెర్చ్ ర్యాంకింగ్స్ ఇలా
1 వైభవ్ సూర్యవంశీ
2 ప్రియాన్ష్ ఆర్య
3 అభిషేక్ శర్మ
4 షేక్ రషీద్
5. జెమీమా రోడ్రిగ్స్
Read Also: మావోయిస్టుల కోటలో మామిడి సిరులు
Follow Us On: X(Twitter)


