కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత జాత్యాహంకార సమాజాల్లో మనది ఒకటని కర్ణాటక హైకోర్టు(Karnataka HC) వ్యాఖ్యానించింది. ఓ ప్రోగ్రామ్ ప్రసారంపై కర్ణాటక ప్రభుత్వం తమ మీద పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆజ్ తక్ ఛానల్(Aaj Tak), ఆ ఛానల్ యాంకర్ సుధీర్ చౌధురి వేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా కర్ణాటక న్యాయమూర్తి జస్టిస్ ఎంఐ అరుణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ సమాజంలోని అసలు సమస్య.. మనమంతా ఒక్కటే మనుష్య జాతి నుంచి వచ్చామని అర్థం చేసుకోలేకపోవడం. జాత్యాహంకారం, వర్ణవివక్ష అంటూ మనం ఇతరులను నిందిస్తాం. కానీ, ప్రపంచంలో అత్యంత జాత్యాహంకార ధోరణులున్న సమాజంలో మనదీ ఒకటి. మనలో ప్రతి వర్గం ఒక ప్రత్యేక జాతిగా భావిస్తుంది. ఇది మన స్వాభావిక లక్షణం. అందుకే రాజకీయ పార్టీలు ఎవరికైనా సీటు ఇచ్చినప్పుడు మిగిలిన విషయాల కంటే ఏ కమ్యూనిటీ అనేదే ఎక్కవ మంది చూస్తున్నారు.
Karnataka HC | అంతేకాదు, ఒక్కోసారి ఆ కమ్యూనిటీనే ఆ అభ్యర్థికి బలంగా మారుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19(1)(ఎ) లపై తమకు నమ్మకం ఉన్నట్లు ఏ రాజకీయ పార్టీ అయినా చెబుతోందా?. రాజకీయ నాయకులు అవినీతి పరులు, నేరస్థులు అని సమాజం అంటుంది. నిజం చెప్పాలంటే వాళ్లకు ఏది దక్కాలో అదే దక్కుతోంది’ అని జస్టిస్ అరుణ్ అన్నారు. అంతేకాదు, బ్రిటీష్ పాలన తర్వాత ప్రస్తుతం మన దేశంలో కార్పొరేట్ వలసపాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. మన సిద్ధాంతాల్లో మతం అత్యంత శక్తిమంతమైనదని, దాని ఆధారంగానే ఆహారం, ఆచార వ్యవహారాలు నిర్ణయమవుతున్నాయని అన్నారు. అనంతరం, కేసు విచారణను జనవరి 13కు వాయిదా వేశారు.
Read Also: యాపిల్, గూగుల్ సైబర్ థ్రెట్ అలర్ట్
Follow Us On: Pinterest


