కలం, వెబ్ డెస్క్: యాపిల్, గూగుల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని తమ వినియోగదారులకు సైబర్ థ్రెట్(Cyber Threat) అలెర్ట్స్ పంపాయి. హ్యాకింగ్, నిఘాకు గురయ్యే ప్రమాదముందంటూ హెచ్చరించాయి. ఈ నెల 2,3న ఈ అలెర్ట్ నోటిఫికేషన్స్ పంపినట్లు తెలిసింది. సాధారణంగా ఈ కంపెనీలూ తరచూ తమ వినియోగదారులకు ఇలాంటి నోటిఫికేషన్స్ పంపడం మామూలే. అయితే, ప్రస్తుతం పంపిన నోటిఫికేషన్స్ పై మరింత దర్యాప్తు జరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలెర్ట్ నోటిఫికేషన్స్ పంపినట్లు యాపిల్ అంగీకరించినప్పటికీ ఎవరు నిఘా పెడుతున్నారు? ఎంత మంది వినియోగదారులను లక్ష్యంగా ఎంచుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.
Cyber Threat | గూగుల్ మాత్రం ఇంటలెక్సా స్పైవేర్ గురించి తమ వినియోగదారుల్లో కొంతమందిని హెచ్చరించినట్లు చెప్పింది. ఇందులో పాకిస్థాన్, కజకిస్థాన్, అంగోలా, ఈజిప్ట్, ఉజ్బెబికిస్థాన్, సౌదీ అరేబియా, తజకిస్థాన్ తదితర దేశాల్లోని వందలాది మందికి నోటిఫికేషన్ పంపినట్లు తెలిపింది. ఇంటలెక్సా అనేది ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీ. ఇది అమెరికా నుంచి పనిచేస్తోంది.
Read Also: దీనావస్థలో కేసీఆర్.. సర్పంచ్‌లను ఇంటికి పిలుస్తుండు..
Follow Us On: X(Twitter)


