Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధం రక్తసిక్తం.. ఇరాన్‌లో 1900 మంది మృతి

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం రక్తసిక్తం అవుతోంది. యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచాన్ని ఆర్థికంగా కుదిపేస్తుంటే.. ఇరాన్‌లో (Iran) మాత్రం ప్రాణ నష్టానికి దారి తీస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌లో (Iran) ఏకంగా 1900 మంది చనిపోయారు. ఈ విషయాన్ని తాజాగా ఐరోపా ప్రకటించింది. అలాగే లెబనాన్ లో 1100 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ లో 18 మంది చనిపోగా.. అరబ్ కంట్రీస్ లో 20 మంది మృతి చెందినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇరాన్ లో చనిపోయిన వారి సంఖ్య అత్యధికంగా ఉందనే చెప్పుకోవాలి.

ప్రస్తుతం యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ఉంటున్నాయని.. త్వరలోనే కీలకమైన అప్డేట్ వస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో తమ ప్రతిపాదనలకు ఇరాన్ ఒప్పుకోవట్లేదని కూడా ట్రంప్ చెప్తున్నారు. అటు ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. హర్మూజ్ జలసంధిపై కూడా కఠినంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇతర శత్రుదేశాలకు ఈ జలసంధి నుంచి అస్సలు వెళ్లేందుకు పర్మిషన్ లేదని చెబుతోంది. దీంతో ఈ యుద్ధం ముగుస్తుందా లేదా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>