కలం, వెబ్ డెస్క్: కేరళ(Kerala)లో ఏనుగుల సంచారం ఎక్కువ. ఎటుచూసినా అడవులు, వన్యప్రాణుల అభయారణ్యాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పెరియార్, అరళం వంటి ప్రాంతాల్లో ఏనుగుల సంచారం చాలా ఎక్కువ. పట్టణీకరణ కారణంగా ఏనుగులు జనవాసాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. పంటలను నాశనం చేయడం, జనాలపై దాడులు చేయడం సాధారణమవుతోంది. అటవీ శాఖ అధికారులు అడవుల్లోకి తిరిగి పంపుతున్న ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం అటవీ అధికారిని ఏనుగు చంపేసిన ఘటన కేరళలో కలకలం రేపింది.
కేరళ(Kerala)లోని అట్టప్పడి అటవీ పరిధిలో కాలిముత్తు(Kaalimuthu)తో సహా ముగ్గురు అధికారులు వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియలను నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ ఏనుగు అధికారులపై దూసుకెళ్లింది. దీంతో వారు భయంతో పరుగులుతీశారు. మిగతా ఇద్దరు అధికారులు స్వల్ప గాయాలతో తప్పించుకోగా, మరో అధికారిని అనే వ్యక్తిని చంపేసింది. ఆ వ్యక్తిని అటవీ శాఖ అధికారి కలిముత్తు (52)గా పోలీసులు గుర్తించారు.
Read Also: ఇండిగో చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. అందుకే సమస్యలు
Follow Us On: Pinterest


