Mobile Popup Ad
Mobile Popup Ad

ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం : ఏలూరు జిల్లాలో జంట ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరిగి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఏలూరు (Eluru) జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలిగిన పరిచయం, ప్రేమ చివరకు ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్యకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన ఇర్రి రమ్య (34)కు ఏలూరు (Eluru) జిల్లాకు చెందిన మావుళ్లయ్య (25) అనే యువకుడితో కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. రమ్యకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, మావుళ్లయ్యతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తన భర్తను, పిల్లలను వదిలేసి ఆమె ప్రియుడి దగ్గరకు వచ్చేసింది.

వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకుని, మరో గ్రామంలో కొత్త కాపురం పెట్టారు. అయితే, రమ్య కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త, బంధువులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వీరిని కనిపెట్టి నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ జంట, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా సోషల్ మీడియాలో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఊహించని విధంగా విషాదంగా ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>