కలం, వెబ్‌డెస్క్ : ప్రపంచ విమానయాన రంగంలో కొత్త రికార్డు నమోదైంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (China Eastern Airlines) సంస్థ ప్రపంచంలోనే అతి పొడవైన ఎయిర్ రూట్‌ను ప్రారంభించింది. షాంఘై నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ వరకు నడిచే ఈ సుదీర్ఘ విమాన మార్గం మొత్తం సుమారు 19631 కిలోమీటర్లు ఉండడం విశేషం. ఈ రూట్ ప్రయాణం దాదాపు 25 గంటల పాటు ఉంటుంది. ఇంధనం నింపుకోవడానికి దారి మధ్యలో న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో రెండు గంటల పాటు ఆగుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు విమానం మారాల్సి అవసరం ఉండదు.
ఈ విమాన మార్గం షాంఘై-ఆక్లాండ్-బ్యూనస్ ఎయిర్స్ మధ్య మొదటిసారిగా సాగుతున్న సుదీర్ఘ ఎయిర్ రూట్ గా చరిత్రలో నిలిచిపోయింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా సాగుతూ మూడు ఖండాలను కలపుతూ ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ అతిపొడవైన ఎయిర్ రూట్ ద్వారా చైనా మరోసారి ఘనత సాధించినట్లయింది. ఈ రూట్ ప్రారంభంతో రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుందని చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (China Eastern Airlines) సంస్థ చెబుతోంది.
ఇంతకుముందు వరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎయిర్ రూట్ గా న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నెడీ-సింగపూర్ చాంగీ ఉండేది. ఈ విమాన ప్రయాణం పొడవు 15,332 కిలోమిటర్లు ఉండగా ప్రయాణ సమయం 18 గంటల నుంచి 19 గంటల వరకు పడుతుంది. ఇప్పుడు షాంఘై–ఆక్లాండ్–బ్యూనస్ ఎయిర్ రూట్ దాన్ని అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, ఆసియా నుంచి అస్ట్రేలియాకు ఉన్న సింగపూర్ చాంగీ – సిడ్నీ ఎయిర్ రూట్ 15,329 కిలోమీటర్ల దూరంతో మూడస్థానానికి పడిపోయింది. 14,526 కిలోమీటర్లతో ఆక్లాండ్ -దోహా నాలుగో స్థానంలో నిలించింది.
Read Also: ఫ్యాన్స్‌కు పండుగే పండుగ.. సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలివే!
Follow Us On : Facebook


