Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 22 వేల కోళ్లను చంపేసిన పౌల్ట్రీ వ్యాపారులు

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బిలాస్‌పూర్ జిల్లాలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాప్తి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోని ప్రాంతంలో మార్చి 19 నుంచి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు హఠాత్తుగా మృతి చెందాయి. భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపిన నమూనాలలో వైరస్ ఉన్నట్లు ధృవీకరణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే వ్యాధి వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నాటికి 22,808 పౌల్ట్రీ పక్షులను చంపి వేయడమే కాకుండా, 25,896 గుడ్లను దాదాపు 79 క్వింటాళ్ల పౌల్ట్రీ మేతను శాస్త్రీయ పద్ధతిలో చంపేశారు.

వ్యాధి విస్తరించకుండా ప్రభావిత ప్రాంతం చుట్టూ కిలోమీటరు పరిధిని ‘ఇన్‌ఫెక్టెడ్ జోన్’గా, పది కిలోమీటర్ల పరిధిని ‘సర్వైలెన్స్ జోన్’గా అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా, విక్రయాలపై పూర్తి నిషేధం విధించారు. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అనుమానిత పక్షుల మరణాల గురించి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొఫెసర్.. కోటి రూపాయలు గోవిందా!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>