కలం, వెబ్ డెస్క్: Sankranthi Cinemas | టాలీవుడ్‌కు ముఖ్యమైన సీజన్లలో సంక్రాంతి ఒకటి. ప్రతి సంవత్సరం పండుగకు విడుదలయ్యే సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. 2026 సంక్రాంతికి అగ్ర హీరోలు నటించిన భారీ సినిమాలు విడుదలవుతుండటం, ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఖరారు కావడంతో ప్రేక్షకుల్లో ఇప్పట్నుంచే ఆసక్తి నెలకొంది. ఈసారి సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి చిత్రాలతో పాటు విజయ్, శివకార్తికేయన్ డబ్బింగ్ చిత్రాలు విడుదల కానున్నాయి.
జనవరి 9 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranthi) సందడి మొదలుకానుంది. ఆ రోజు ప్రభాస్ రాజా సాబ్, విజయ్ జన నాయగన్ అనే రెండు పెద్ద సినిమాలు (Cinemas) ఒకే రోజు విడుదలవుతాయి. ఈ రెండు ఒకేసారి విడుదలకాబోతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత జనవరి 12న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ థియేటర్లలోకి వస్తుంది. జనవరి 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదల కానుంది.
ఇక జనవరి 14న రెండు సినిమాలు కలిసి విడుదల కానున్నాయి. నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ , శివకార్తికేయన్ ‘పరాశక్తి’. ఇద్దరు నటులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలున్నాయి. శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి జనవరి 15న విడుదల కానుంది. ఈ చిత్రంతో సంక్రాంతికి తెరపడనుంది.
Read Also: డ్రాగన్ క్రేజీ అప్డేట్.. భారీ యాక్షన్‌కు సిద్ధమైన ఎన్టీఆర్
Follow Us On : Facebook


