కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం(Khammam) జిల్లాలో భారీ వన్యప్రాణులను వేటాడిన ఘటన సంచనలంగా మారింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్ కావడం గమనార్హం. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్‌లో తుపాకులతో దుప్పులను వేటాడారు(Deer Poaching). ఈ కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు మెచ్చా రఘును ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రఘును ఏ2గా, గోపి కృష్ణ ఏ1, శ్రీరామ్ ప్రసాద్ ఏ3, భరత్ ఏ4గా తేల్చారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ప్రధాన నిందితుడు రఘు ఇటీవల తన వివాహ వేడుకలో సన్నిహితులకు దుప్పి మాంసం వడ్డించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే రఘు ఎన్ని సార్లు వేటాడారు? వేటకు ఎవరైనా సహకరించారా? వేటలో ఉపయోగించిన ఆయుధాలు ఏంటి? వాటిని రఘు ఎలా సమకూర్చుకున్నారు. వాటికి లైసెన్స్ ఉందా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
అక్టోబర్ నెలలో రాత్రి సమయంలో రఘు తన మిత్రులతో కలిసి నీలాద్రి అర్బన్ పార్క్‌లోకి వెళ్ళి ఐదు దుప్పులను వేటాడి (Deer Poaching), వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు అధికారులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించినట్లు సమాచారం. దీంతో పోలీసులు రఘును, అతడి మిత్రులను వేర్వేరుగా విచారించి వివరాలు సేకరించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు సత్తుపల్లి ఎఫ్‌డీఓ మంజుల తెలిపారు. అటవీ జంతువులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు.
Read Also: ఏసీబీకి చిక్కిన అధికారి.. అన్నదాతల సంబురాలు
Follow Us On : Facebook


