Mobile Popup Ad
Mobile Popup Ad

రష్మిక-విజయ్ రొమాంటిక్ వెకేషన్.. వైరల్ అవుతున్న వీడియో!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (Rashmika-Vijay) వివాహం తర్వాత థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ ద్వీపంలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ విల్లాలో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మిక, విజయ్‌ను మొదటిసారి ‘నా భర్త’ అని పిలుస్తూ మురిసిపోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్రకృతి ఒడిలో ఉన్న ఒక విలాసవంతమైన విల్లాలో ఈ జంట (Rashmika-Vijay) కనిపించారు. అక్కడ వారు కలిసి డ్యాన్స్ చేయడం, ఈత కొట్టడం, టేబుల్ టెన్నిస్ ఆడుతూ గడుపుతున్న దృశ్యాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో మనం ఏం చేస్తాం?” అని విజయ్ అడిగిన ప్రశ్నకు, ప్రపంచం మొత్తం చుట్టేద్దాం’ అని రష్మిక సమాధానమివ్వడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతోంది. ఈ అందమైన ప్రదేశంలో తమ స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలను రష్మిక తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Read Also: ఈ వేసవిలో ఇంట్లోనే కర్బూజా పండ్లను పండించండిలా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>