Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి.. బ్యాంకర్లతో నల్లగొండ కలెక్టర్ సమావేశం

కలం, నల్లగొండ బ్యూరో : ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుందని, బ్యాంకర్లు లక్ష్యాలను పూర్తి చేయాలని నల్లగొండ (Nalgonda) కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్, డిసెంబర్ 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrasekhar) మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలను బ్యాంకుల సహకారంతో అమలు చేస్తున్నదన్నారు.

ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహిక వేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డీఆర్డీఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే తదితర రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా వివిధ రంగాల్లో ఇస్తున్న శిక్షణలో భాగంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే అతి పేదవారు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను బ్యాంకర్లు పెద్ద మనసుతో జాప్యం చేయకుండా మంజూరు చేయాలని సూచించారు. అలాగే ఆర్‌సెట్టీ సంస్థ శిక్షణ సమయంలోనే.. శిక్షణ పొందుతున్న వారికి లోన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎలాంటి బ్యాంకులను సంప్రదించాలో తెలియజేయాలని ఆర్‌సెట్ డైరెక్టర్‌ను ఆదేశించారు.

గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజీ, మెప్మా ,సెర్ప్, ఎస్సీ ,ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30 లోపు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డిఒ గోమతి, నాబార్డ్ డీడీఎమ్ వినయ్, డీసీసీబీ సీఈఓ శంకర్ రావు, సంబంధిత శాఖల నల్లగొండ (Nalgonda) జిల్లా అధికారులు, బ్యాంకుల నియంత్రణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. మరో ఇద్దరు అరెస్ట్..!

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>