కలం డెస్క్ : దేశవ్యాప్తంగా లాజిస్టిక్ వ్యాపారాన్ని విస్తరింపజేయాలనుకున్న కార్ల తయారీ కంపెనీ మహింద్రా (Mahindra Logistics) ఇప్పుడు దక్షిణ భారత్‌లో తెలంగాణను సరైన స్థానంగా ఎంచుకున్నది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని పరిస్థితులను స్టడీ చేసిన కంపెనీ యాజమాన్యం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బస్సాపూర్ ప్రాంతాన్ని సెలెక్టు చేసుకున్నది. గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) భాగంగా మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా (Anand Mahindra) దీన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. సుమారు 3.28 లక్షల చ.అ విస్తీర్ణంలో నడుస్తున్న ఆదిత్య ఇండస్ట్రియల్ లాజిస్టిక్ పార్క్ ను నెలకు రూ. 6.89 కోట్ల అద్దెకు తీసుకున్నారు. ఐదేండ్ల పాటు లీజ్ ఒప్పందం కూడా కుదిరింది. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాలకు లాజిస్టిక్ సేవలను మహింద్రా కంపెనీ అందించనున్నది.
బెస్ట్ డెస్టినేషన్‌గా హైదరాబాద్, తెలంగాణ :
అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరాన్ని డాటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లు, కాల్ సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న సమయంలో వ్యాపార అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న మహింద్రా కంపెనీ సైతం లాజిస్టిక్స్ అవసరాలను గుర్తించి సిద్దిపేట జిల్లాను ఎంచుకున్నది. దేశానికి నలు దిక్కులా లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకున్న మహింద్రా కంపెనీ ఇప్పటికే కోల్‌కతా, పూణె సమీపంలోని ఖేడ్, గువాహటి (అసోం), అగర్తలా (త్రిపుర) నగరాల్లో 27.1 మిలియన్ చ.అ విస్తీర్ణంల లాజిస్టిక్(Mahindra Logistics) పార్కుల్ని నెలకొల్పగా ఇప్పుడు సిద్దిపేట బస్వాపూర్ పార్కు సైతం ఆ జాబితాలోకి చేరింది. బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి నగరాలు ఉన్నప్పటికీ తెలంగాణను ఎంచుకోవడం వ్యాపారపరంగా కలసొస్తుందనేది మహింద్రా కంపెనీ ప్రతినిధుల అభిప్రాయం.
Read Also: ఇండిగో సంక్షోభం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
Follow Us On: Pinterest


