Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ నాయ‌క‌త్వం బ‌ల‌హీన‌ప‌డింది: డొనాల్డ్ ట్రంప్

క‌లం, వెబ్ డెస్క్‌: యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్ర‌క‌టించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ నాయ‌క‌త్వం బ‌ల‌హీన ప‌డింద‌ని, యుద్ధంతో పైచేయి త‌మదేన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన యుద్ధంలో ఇరాన్ నావికాదళం, వాయుసేన, కమ్యూనికేషన్ వ్యవస్థలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని వెల్ల‌డించారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో తమ విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు ఇరాన్ ట్రంప్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను కొట్టివేస్తూనే ఉంది. ఇరాన్ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్చ‌ల‌కు ప్ర‌య‌త్నించ‌లేద‌ని, ట్రంప్ అబ‌ద్ధాలు చెప్తున్నార‌ని, ఇరాన్‌కు భ‌య‌ప‌డే ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించింది. ట్రంప్ ఇచ్చిన ఐదు రోజుల విరామం మ‌రో రెండు రోజుల్లో ముగుస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>