కలం డెస్క్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా భారీ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్.. కటానా (జపాన్ స్టైల్ ఖడ్గం) పట్టుకుని రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు తనను ఆ ఈవెంట్‌కు గన్ను పట్టుకుని రమ్మన్నారని తాజాగా పవన్ చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘ఓజీ’ సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో పాల్గొన్న పవన్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరిచేత నవ్వులు పూయించారు. అసలు తాను ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు.
‘‘ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కటానా పట్టుకుని రావాలని సుజిత్, తమన్ అడిగారు. అందుకే ఓకే చెప్పా. అసలు కటానా పట్టుకుని రావడం ఓ పెద్ద సమస్య అయితే.. అప్పుడే వర్షం కూడా పడింది. నా జీవితంలో నేనెప్పుడూ అలా చేయలేదు. అందరూ నాతో ఆడుకుంటున్నారని అనుకున్నా. ఆ ఈవెంట్‌కి బ్లాక్ డ్రస్ వేసుకుని, గన్ పట్టుకొని రావాలని సుజిత్ ఫస్ట్ అడిగాడు. చంపేస్తా అని చెప్పా. అందుకే గన్నును కటానాతో రీప్లేస్ చేశాడు. గన్ నా వీక్‌నెస్ అని తెలుసుకుని వాళ్లు నాతో ఆడుకుంటున్నారు’’ అని పవన్ సరదాగా చెప్పారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 25న విడుదలైన ‘ఓజీ’ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. రూ.300 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్లు చేయడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగానే ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

