కలం, వెబ్ డెస్క్: శబరిమల దర్శనానికి వెళ్లి దీక్ష విరమించి వస్తున్న భక్తుల జీవితాలు విషాదంగా ముగిశాయి. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Rameswaram accident) ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు, గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన మరో భక్తుడు శబరిమల ఆలయానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో భాగంగా రామేశ్వరం (Rameswaram) దగ్గర కారును కొద్దిసేపు నిలిపి అందులో నిద్రిస్తున్నారు. వీరి కారును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం (Accident) లో మరో భక్తుడు తీవ్రంగా గాయపడగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏపీ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also: తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన ‘మహింద్రా’
Follow Us On: Facebook


