కలం డెస్క్ : Mass Jathara | థియేటర్ల దగ్గర మాస్ జాతర చేయడానికి మాస్ మహారాజా రవితేజ రెడీ అవుతున్నాడు. ఇందుకోసం అక్టోబర్ 31న ముహూర్తం ఫిక్స్ చేశాడు. రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కావడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో వింటేజ్ రవితేజ కనిపించనున్నాడు. ఈ మూవీలో పక్కా కమర్షియల్ అంశాలకు కొదవేలేదు. ఈమూవీ రిలీజ్ అయితే థియేటర్లలో అసలుసిసలైన మాస్ జాతర కనిపిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. వింటేజ్ రవితేజను చూడటానికి అభిమానులు చాలా కాలంగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని, వాళ్ల ఈ ఆశ ఈ మూవీతో తీరుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మూవీ రిలీజ్ డేట్ విడుదల సందర్భంగా మూవీ టీమ్.. రవితేజ, హైపర్ ఆదీలపై చిత్రీకరించిన ఓ సరదా క్లిప్‌ను షేర్ చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది.. 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినయాక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని ఎగతాళి చేస్తుంటాడు. దానిపై స్పందించే రవితేజ అంతే చమత్కారంగా రిప్లై ఇస్తాడు. అక్టోబర్ 31 ఫిక్స్ అయినట్లు చెప్తాడు. ఈ మూవీలో రవితేజ సరసన శ్రీలీల నటించింది. వీరిద్దరి జోడీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

