Mobile Popup Ad
Mobile Popup Ad

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో కోర్టుల‌కు బాంబు బెదిరింపులు (Bomb Threats) రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఒకేరోజు ఏపీ, తెలంగాణ‌లో రెండు కోర్టుల‌కు దుండ‌గుల నుంచి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఏపీలోని మచిలీపట్నం (Machilipatnam) జిల్లా కోర్టు, తెలంగాణ‌లోని ములుగు (Mulugu Court) జిల్లా కోర్టుల్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ మెయిల్ పంపించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఆయా కోర్టుల‌కు చేరుకొని పరిసరాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. న్యాయ‌వాదులు, సిబ్బందిని ముంద‌స్తుగా బ‌య‌ట‌కు పంపించారు. త‌నిఖీల నేప‌థ్యంలో లోప‌లికి ఎవ‌రినీ అనుమ‌తించ‌లేదు. అయితే త‌నిఖీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అనుమానాస్ప‌ద వ‌స్తువులు ల‌భించ‌లేదు. ఇటీవ‌ల ప‌లు మార్లు ఫేక్ బాంబు బెదిరింపులు వ‌చ్చిన‌ నేప‌థ్యంలో ఇది కూడా అలాంటిదేన‌ని పోలీసులు భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌నిఖీలు కొన‌సాగిస్తున్నారు.

Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>