Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారికి జనసేన అండగా ఉంటుంది : నాగబాబు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలుగు వారు, జనసైనికులు, వీర మహిళలతో నాగబాబు జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. యుద్ధం త్వరలోనే ముగిస్తుందని ఆశిస్తున్నట్టు నాగబాబు తెలిపారు. దుబాయ్, సౌదీ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ దేశాల్లో ఉంటున్న తెలుగు వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడాలని నాగబాబు (Nagababu) సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎప్పటికప్పుడు గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వారి యోగ క్షేమాలపై ఆరా తీస్తున్నారని.. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా నిలబడుతుందని నాగబాబు తెలిపారు. తెలుగు వారు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా జనసేన సాయం అందించడానికి రెడీగా ఉంటుందని.. గల్ఫ్‌ దేశాల్లోని జనసేన ఇన్ ఛార్జులతో ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని నాగబాబు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>