కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా వందలాది ఇండిగో ఫ్లైట్లు(Indigo Flight) రద్దవుతున్న సందర్భంగా డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ పై తాత్కాళికంగా ఇండిగోకు ఉపశమనం కలిగించింది. తమ సర్వీసులు రద్దు అవుతున్న సందర్భంగా ఎఫ్డీటీఎల్ విషయంలో సవరణ చేయాలని ఇండిగో అధికారులు డీజీసీఏ(DGCA)ను కోరారు. వారి రిక్వెస్ట్ తో పాటు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
వారానికి గతంలో 36 గంటల రెస్ట్ టైమ్ ఉంటే.. దాన్ని కొత్త రూల్స్ ప్రకారం 48 గంటలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్తగా పెంచిన వీక్లీ రెస్ట్ గంటలను సెలవులుగా పరిగణిస్తామని డీజీసీఏ తెలిపింది. అంటే పాత రూల్స్ ప్రకారం పైలట్స్ ఇక నుంచి పనిచేయొచ్చు. ఎయిర్ లైన్స్ సర్వీసుల్లో రెస్ట్ గంటలను, సెలవులను వేర్వేరుగా చూస్తారు. రెస్ట్ గంటలను కచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ సెలవు గంటలు అనేవి సంస్థపై ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఇండిగో తన పైలట్స్ ను పాత పనిగంటల ప్రకారమే పనిచేయించడానికి రెడీ అయింది. వారానికి 36 గంటలే రెస్ట్ టైమ్ ఇవ్వనుంది. ఈ లెక్కన ఫ్లైట్ క్యాన్సిల్ కావడం, డిలే అవ్వడం తగ్గనున్నాయి. కాకపోతే ఈ సవరణలు తాత్కాళికమే అని డీజీసీఏ తెలిపింది. వీలైనంత త్వరగా ఈ ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకోవాలని ఇండిగోకు ఆర్డర్ వేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపింది. ఈ ఫ్లైట్(Indigo Flight) క్యాన్సల్స్ కావడంపై ఎంక్వయిరీ చేయించేందుకు డీజీసీఏ సిద్ధం అయింది.
Read Also: ఇండియా- రష్యా కీలక ఒప్పందాలు.. ట్రంప్ ఏం చేస్తాడో..?
Follow Us On: Facebook


