కలం డెస్క్ : Allu Sirish | అల్లు వారి ఇంట పెళ్ళి సందడి మొదలైంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి అల్లూ శిరీష్ రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. అతి త్వరలో నిశ్చితార్థం జరగనున్నట్లు చెప్పాడు. నయనిక అనే యువతిలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పాడు. అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థం జరగనుందని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు.
‘‘మా తాత అల్లూ రామలింగయ్య జయంతి సందర్బంగా.. నా మనకు బాగా నచ్చిన, దగ్గరైన ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను, నయనిక అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నేను పెళ్ళి చేసుకోవాలి మా నాన్నమ్మ ఎప్పుడూ కోరుతుండేది. ఆమె ప్రస్తుతం మా మధ్య లేకపోయినా.. తన ఆశీస్సులు ఎప్పుడూ మాతో ఉంటాయి’’ అని శిరీష్ రాసుకొచ్చాడు. ఈ మెసేజ్‌తో పాటు నయనికతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫొటోను శిరీష్ షేర్ చేశాడు.

