కలం, వెబ్ డెస్క్: ఇప్పుడు దేశ వ్యాప్తంగా వందలాది ఇండిగో ఫ్లైట్స్(indigo Flights) రద్దు అవుతున్నాయి. వేల మంది ఎయిర్ పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. తిండి, నిద్ర లేక ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా ఫ్లైట్స్ లేట్ అయినప్పుడు ప్రయాణికులు కచ్చితంగా తమ హక్కులు తెలుసుకోవాలి. వాళ్లకు ఫ్లైట్ సర్వీసులు(Flight Services) ఏమేం ఫ్రీగా ఇస్తాయో తెలుసుకుని యూజ్ చేసుకోవాలి. ఫ్లైట్ 2 గంటల కంటే ఎక్కువ లేట్ అయితే ఫుడ్, వసతి ఉచితంగా కల్పించాలి.
24 గంటల కంటే ఎక్కువ లేట్ అయితే హోటల్స్ లో స్టే చేయడానికి కంప్లీట్ బిల్లులు చెల్లిస్తాయి ఆ ఫ్లైట్ కంపెనీలు. లోకల్ గా అయ్యే రవాణా ఛార్జీలు కూడా కస్టమర్లకు చెల్లించాల్సిందే. అవసరం అయితే ఫుల్ రీఫండ్ తీసుకోవచ్చు లేకపోతే అదే డబ్బులతో వేరే ఫ్లైట్ లో జర్నీ చేయొచ్చు. ఒక వేళ విమాన సంస్థ మీ లగేజీ పోగొడితే దానికి సరిపోయేంత పరిహారం డిమాండ్ చేయొచ్చు.
Flight Services | ఓవర్ బుకింగ్ వల్ల సీటు దొరక్కపోతే రీఫండ్ తో పాటు పరిహారం డిమాండ్ చేసే హక్కు ఉంది. విమాన సర్వీసులు, ఫ్లైట్ ఆలస్యంపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకునే రైట్ ప్రయాణికులకు ఉంటుంది. టెక్నికల్ ఇష్యూస్, వేరే కారణాల వల్ల ఫ్లైట్ లేట్ అయితే పూర్తిగా రీ ఫండ్ చేయాలి. 7 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నాక 24 గంటల ముందు ఫ్లైట్ క్యాన్సిల్ అయితే కంప్లీట్ గా రీ ఫండ్ చేయాలి. ఇలాంటి టైమ్ లో పరిహారం ఇవ్వరు. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ లేట్ అవుతున్నాయి కాబట్టి ప్రయాణికులు ఈ వెసలుబాట్లను వినియోగించుకోవాలి.
Read Also: దేవుడి సొమ్ము సహకార బ్యాంకుల్ని కాపాడడానికి కాదు: సుప్రీం
Follow Us On: Pinterest


