Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా మిత్ర దేశాలపైనా దాడులు.. ట్రంప్‌కు ఇరాన్ కౌంట‌ర్‌

క‌లం, వెబ్ డెస్క్‌: హోర్మూజ్ జ‌ల‌సంధి గుండా ఇరాన్ (Iran) త‌క్ష‌ణ‌మే ర‌వాణాను పున‌రుద్ధ‌రించాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇచ్చిన వార్నింగ్‌కు ఇరాన్ ధీటుగా బ‌దులిచ్చింది. మాపై దాడులు చేస్తే అమెరికా స‌ముదాయాల‌పై దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకునేది లేద‌ని పేర్కొంది. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావ‌రాలు, స‌ముదాయాల‌పై దాడులు తీవ్ర త‌రం చేస్తామ‌ని ఇరాన్ పేర్కొంది. మ‌రోవైపు ట్రంప్ ఇరాన్‌కు 48 గంట‌ల డెడ్ లైన్ ఇచ్చినా ఇరాన్ ఇలా స్పందించ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీస్తోంది. 48 గంట‌ల త‌ర్వాత ప‌రిస్థితులు ఏ విధంగా ఉంటాయ‌న్న‌ది ఉత్కంఠ రేపుతోంది.

Read Also: ఆర్ఆర్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: అశ్విన్

Follow Us On: Pinterest

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>