epaper
Tuesday, November 18, 2025
epaper

Electric Vehicles | ఈవీలకూ సౌండ్ మస్ట్..

కలం డెస్క్ : Electric Vehicles | ఈవీ వాహనాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లాయో కూడా తెలీదు. అయితే ఇకపై అలా కుదరదు. ఎందుకంటే ఈవీ వాహనాలకు కూడా సౌండ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం రూల్ తీసుకొచ్చింది. తాము ఈ నిర్ణయం పాదచారులు, సైకిల్‌పై ట్రావెలింగ్ చేసే వారి సేఫ్టీ కోసమే తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అసలేంటీ విషయం అంటే.. మామూలు డీజిల్, పెట్రోల్ వాహనాలు వచ్చేటప్పుడు వాటి సౌండ్‌తోనే ఏదో వాహనం వస్తుందని అర్థమైపోతుంది. కానీ ఈవీ వాహనాలు అలా కాదు. అవి బ్యాటరీ, మోటర్‌తో పనిచేయడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. దాంతో హారన్ కోడితేనే అవి వస్తున్నాయని అర్థం కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కేంద్రం ఈ కొత్త రూల్‌ను పరిచయం చేసింది. ఇకపై ఈవీలకు కూడా వెహికల్ అలర్ట్ సిస్టమ్(AVAS) తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. 1 అక్టోబర్ 2026 తర్వాత తయారయ్యే కొత్త ఎలక్ట్రిక్ వాహనాలన్నీ ఈ సిస్టమ్‌తో వస్తాయని చెప్పింది. ఈ మేరకు కేంద్రం తన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. వెహికల్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని చేస్తుంది. తద్వారా పాదచారులు, ఇతరులు వాహనం వస్తుందని ముందుగానే గుర్తిస్తారు. ఈ శబ్ద స్థాయిలు ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం ఉంటుంది. అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు హైబ్రిడ్ వాహనాలకు ఈ ఫీచర్‌ను ఇప్పటికే తప్పనిసరి చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>