Mobile Popup Ad
Mobile Popup Ad

అఫ్గ‌నిస్తాన్‌లో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌తో ప్ర‌కంప‌న‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: అఫ్గ‌నిస్తాన్‌ (Afghanistan)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం (Earthquake) రావ‌డం క‌ల‌క‌లం రేపింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత న‌మోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక ప్రకారం ఈ భూకంపం భూమి లోపల 82 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. అంతకుముందు శ‌నివారం ఉదయం కూడా 4.5 తీవ్రతతో మరో భూకంపం సంభ‌వించింది. ఈ భూకంప కేంద్రం సుమారు 130 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇలాంటి భూ కంపాలు తక్కువ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అఫ్గ‌నిస్తాన్‌ (Afghanistan) భౌగోళికంగా భారతీయ యూరోసియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా హిందూకుష్ పర్వత ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ జోన్‌లో ఉంది. దశాబ్దాలుగా యుద్ధాలు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశ ప్రజలకు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరిగిన ఈ రెండు భూకంపాల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: వేద పాఠశాలలో దారుణం: విద్యార్థిని చితకబాదిన టీచర్

Follow Us On: Facebook

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>