కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని చిన్నారి మృతి

కలం, వెబ్​ డెస్క్​ : కరీంనగర్ (Karimnagar) జిల్లా శంకరపట్నం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతురాలిని మహారాష్ట్రకు చెందిన శ్రవణ్, పులా దంపతుల కుమార్తె నిత్యగా గుర్తించారు. బతుకుదెరువు కోసం దాదాపు 30 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఈ కుటుంబం, ఇక్కడే గొడ్డళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది. నిత్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీకొట్డినట్లు తెలుస్తోంది. అల్లారుముద్దుగా పెరుగుతున్న చిన్నారి కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమ‌తులు షురూ!

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>