ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే పెళ్లిల్లో ఇరు కుటుంబాలు కొట్లాడుకోవడం సాధారణంగా మారింది. వరుడు తలపాగా ధరించలేదని, వధువు మేకప్ ఎక్కువగా వేసుకుందని లాంటి సిల్లీ విషయాలకే గొడవ పడిన ఘటలెన్నో చూశాం. అయితే పెళ్లి వేడుకల్లో గొడవలు ఎక్కువగా భోజనాల దగ్గరే జరుగుతుంటాయి. ఇటీవల జరిగిన ఓ పెళ్ళిలో కేవలం రసగుల్లా (Rasgulla) కారణంగా వధూవరుల కుటుంబాలు ఘర్షణకు దిగడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బీహార్‌లోని బోధ్ గాయలో ఓ పెళ్లి జరిగింది. బంధుమిత్రులు, అతిథులతో పెళ్లి ప్రాంగంణ సందండిగా ఉంది. అయితే పెళ్లి తంతు ప్రశాంతంగా జరిగినప్పటికీ భోజన సమయంలో గొడవ తలెత్తింది. పెళ్లి భోజనాల్లో రసుగుల్లా (Rasgulla) అయిపోవడంతో గొడవ మొదలైంది. మొదట గొడవ చిన్నగా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత మాటకుమాట పెరిగి ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై మరొకరు చేయి చేసుకుని పొట్టు పొట్టు కొట్లాడుకున్నారు. స్థానికులు కొందరు రంగప్రవేశం చేసి సమస్యను సద్దుమణిగేలా చేశారు.
పెళ్ళికి హాజరైనవారిలో ఓ వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసిప్పటికీ ఎవరూ అరెస్ట్ కాలేదు. చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద గొడవలకు ఎలా దారితీస్తాయో ఈ ఘటన తెలియజేస్తోంది. కేవలం రసగుల్లా కోసం కొట్లాడుకుంటారా… అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: కాళోజీ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా రమేశ్ రెడ్డి
Follow Us On: Facebook


