రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. టీపీసీసీ చీఫ్ హోదాలో తిరుగులేని అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలకు చేరువయ్యారు. అయితే రేవంత్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. రేవంత్ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ జూబ్లీ బైపోల్‌తో అందరి నోళ్లూ ముయించాడు.
ఈ ఉప ఎన్నిక బూస్ట్‌తో వచ్చే పదేళ్లు తానే సీఎం ఉంటానని తేల్చి చెప్పాడు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన కొనసాగిస్తున్నానని, రెండేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం అన్నారు. కనీసం తాను కూడా గంట విశ్రాంతి తీసుకోలేదని ఆయన అన్నాడు. ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి.
Read Also: డర్టీ సిటీ.. చెత్త నగరంగా హైదరాబాద్
Follow Us On: X(Twitter)


