Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మిక సంక్షేమానికి భారీ గుడ్‌న్యూస్, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమానికి భట్టి గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ బడ్జెట్‌లో కార్మిక సంక్షేమ శాఖకు (Labour Welfare) 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయడం, కార్మిక సంక్షేమం, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారికి అన్నివిధాల ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. “టి-గేట్” డిజిటల్ ప్లాట్ ఫాం నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం ఉద్యోగ అనుసంధాన సేవలను అందిస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఒక లక్ష మూడువేల మంది కార్మికులను నమోదు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో 55,594 మంది లబ్ధిదారులకు 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని భట్టి గుర్తుచేశారు.

రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారాUAE, Germany, Japan, UK, Canada వంటి 16 దేశాల్లో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు త్వరలో “సీఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభిస్తున్నామని భట్టి చెప్పారు.

రాష్ట్ర యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణను, వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. వారికివీసా మార్గదర్శకత, విదేశీ ప్రయాణానికి కావాల్సిన రక్షణను కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యమని భట్టి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>