హైదరాబాద్(Hyderabad) అనగానే అనేక చారిత్రత్మకమైన ప్రదేశాలు కళ్లముందు కదలాడుతాయి. గోల్కొండ, చార్మినార్, పలక్ నుమా ప్యాలెస్‌తో పాటు ఎన్నో టూరిజం ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే మన బిర్యానీకి ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ దూసుకుపోతోంది. అయితే బ్యూటీఫుల్ సిటీగా పేరొందిన భాగ్యనగరం అంత్యంత చెత్త నగరంలో చోటు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
రాడికల్ స్టోరేజ్, గ్లోబల్ లగ్గేజ్ స్టోరేజీ నెట్‌వర్క్.. ఇటీవల టూరిస్టుల రివ్యూ ఆధారంగా అత్యంత శుభ్రమైన, మలినమైన నగరాల జాబితాను రూపొందించింది. అందులో హైదరాబాద్(Hyderabad) ప్రపంచంలోని 20 చెత్త నగరాల్లో 18వ స్థానంలో నిలిచింది. పర్యాటకం, ట్రావెల్ సస్టైనబిలిటీ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక కార్యకలాపాలు లాంటి అంశాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. హైదరాబాద్‌పై ఇచ్చిన 633 రివ్యూల్లో 16.1 శాతం ఇక్కడి శుభత్రపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.
Read Also: ఇండిగో పరేషాన్.. ఆన్ లైన్‌లో రిసెప్షన్
Follow Us On: Facebook


