epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అప్పుడే..!

కలం, వెబ్ డెస్క్: నేడు రిలీజ్ కావాల్సిన అఖండ 2(Akhanda 2) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నిన్న ప్రీమియర్స్ కు రెండు గంటల ముందే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ నిరాశలో ఉన్నారు. ప్రీమియర్స్ షోల కోసం థియేటర్లకు వెళ్లిన ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ఇప్పుడు అందరి చూపు కొత్త రిలీజ్ డేట్ మీదనే ఉంది. నిర్మాణ సంస్థకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్లే వాయిదా పడింది. వాటిని క్లియర్ చేసుకుని లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూడ్డానికి ఇంకొంచెం టైమ్ పట్టేలా ఉంది. బుక్ మై షోలో 2026 రిలీజింగ్ అని పెట్టేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే అఖండ 2 కొత్త ఏడాదిలోనే రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ సంక్రాంతికి వస్తుందా అనే టాక్ కూడా స్టార్ట్ అయింది. సినిమా ఔట్ పుట్ ఎలాగూ రిలీజ్ కు రెడీగా ఉంది. రెండు వారాల్లో క్లియర్ అయ్యేలా లేదు. నెలాఖరు వరకు రిలీజ్ చేస్తే సంక్రాంతి సినిమాలు డామినేట్ చేస్తాయి. కాబట్టి సంక్రాంతికే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోందంట. అది కుదరకపోతే సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకోవైపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకునే పనిలో పడింది 14 రీల్స్ ప్లస్ సంస్థ. బాలయ్య(Balakrishna) సినిమాలు ఇలా డిలే కావడం చాలా అరుదు.

అఖండ 2(Akhanda 2) మీద భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ మూడు రోజుల దాకా టికెట్స్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్లందరికీ అమౌంట్ రీ ఫండ్ చేస్తారా.. లేదంటే అదే టికెట్ తో రాబోయే రిలీజ్ డేట్ కు వెళ్లమంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య రిలీజ్ డేట్ వాయిదా వేసినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

Read Also: లండన్‌లో షారుక్, కాజోల్ స్టాచ్యూ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>