Mobile Popup Ad
Mobile Popup Ad

రాములవారి ఆదాయం 2, వ్యయం 11

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి (Sri Sita Ramachandra Swamy) వారి జన్మ నక్షత్రం పునర్వసు అని పండితులు పేర్కొంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి తిథి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో జన్మించారు.

జాతకం ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11గా ఉండగా, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంది. అలాగే సీతమ్మవారి ఉత్తర నక్షత్రం, కన్యారాశికి చెందినదిగా భావిస్తారు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉండగా, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. అయితే ఇవన్నీ లాంఛనప్రాయంగా చెప్పుకునేవేనని, శ్రీ సీతారామచంద్రస్వామి జగత్ పాలకుడిగా సమస్త గ్రహాలను నడిపిస్తారని పండితులు వివరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉగాది (Ugadi) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుకళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం భద్రాచలంలోని పవిత్ర గోవిందరాజ స్వామి ఆలయంలో పుట్టమన్ను కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై, స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>