సినిమాలకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌ను మారుస్తాం : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : సినిమాలకు గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ ను మారుస్తామని సీఎం రేవంత్ (Revanth) చెప్పారు. గద్దర్ సినీ అవార్డులు-2025 వేడుకలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అవార్డులు అందుకున్న వారికి ముందుగా అభినందనలు తెలిపారు సీఎం. ‘ఒకనాడు చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్ కు రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ చాలా కష్టపడ్డారు. వారి వల్లే ఇక్కడకు పరిశ్రమ వచ్చింది. రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టడం వల్ల టాలీవుడ్ కు దోహదపడింది. సినీ పెద్దగా దాసరి నారాయణ రావు ఉండి ఇక్కడ పరిశ్రమ సక్సెస్ ఫుల్ గా నడవడానికి వెన్నుదన్నుగా నిలిచారు’ అని సీఎం రేవంత్ (Revanth) చెప్పారు.

తెలుగు, తమిళం, హిందీ సినిమాగా కాకుండా.. పాన్ ఇండియా, గ్లోబల్ సినిమాలు తీయడానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘ఇండియన్ సినిమాను ఒకే గొడుగు కిందకు రావడానికి హైదరాబాద్ పనిచేస్తోంది. బాహుబలి త్రిబుల్ ఆర్, పుష్ప లాంటి సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇలా సినిమా స్థాయి పెరుగుతోంది కాబట్టే.. ఐటీ, ఫార్మా రేంజ్ లో సినిమా ఇండస్ట్రీని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గద్దర్ అవార్డులను ప్రారంభించాం. రెండోసారి అవార్డులు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూనియర్లను అభినందించడానికి సీనియర్లు రావడాన్ని అభినందిస్తున్నా. కొరియా, జపాన్ సినిమాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయంటే అక్కడి ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయి. మా ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. సినిమాలను ప్రోత్సహించడానికి ఒక సిండిల్ విండో విధానాన్ని మా ప్రభుత్వం తీసుకొస్తోంది. సినిమాలకు కావాల్సిన అన్ని పర్మిషన్లను ఇక నుంచి సింగిల్ విండో నుంచే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని సీఎం రేవంత్ ప్రకటించారు.

హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ సినిమాలకు హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్. ‘నెట్ ఫ్లిక్స్ జీసీసీ సెంటర్ ను ఇక్కడ ప్రారంభించిందంటే హాలీవుడ్ ఇక్కడకు వచ్చినట్టే. సినిమాలను హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం అందిస్తోంది. ఏఐ మన జీవితాల్లో ఇంపాక్ట్ చూపిస్తోంది. కాబట్టి అలాంటి టెక్నాలజీని సినిమాల్లో కూడా వాడుకుని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి. దేశంలోనే ఫస్ట్ సిటీగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం ఒక బాధ్యతగానే సినీ పరిశ్రమను గుర్తిస్తున్నది’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

గద్దర్ పేరుతో అవార్డులు అందుకే ఇస్తున్నాం..

సినీ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడానికి ఒక కారణం ఉందన్నారు సీఎం రేవంత్. గద్దర్ అంటేనే ప్రజలను ఉత్తేజపరిచే గొప్ప గళం అని.. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉందన్నారు. గద్దర్ ప్రభావం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తుందని.. గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి అని సీఎం రేవంత్ కొనియాడారు. అందుకే అలాంటి వ్యక్తిని స్మరించుకోడానికి అవార్డులకు ఆయన పేరు పెట్టినట్టు సీఎం వెల్లడించారు. సమాజంలోని సమస్యలపై పోరాటానికి ఈ అవార్డులు ఉపయోగపడాలని, సినీ ఇండస్ట్రీని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్టు సీఎం రేవంత్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>