ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Polls) చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఓట్ల కోసం కొంతమంది అభ్యర్థులు గుప్పిస్తున్న హామీలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. వార్డు మెంబర్లుగా సర్పంచ్‌లుగా ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రెస్టేజీ ఇష్యూగా మారిపోయాయి. వార్డు స్థాయిలో కూడా పోటాపోటీగా రాజకీయం నడుస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది. ఈ వార్డులో ఓ గృహిని అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమె తరఫున ప్రచారం చేస్తున్న భర్త ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. వార్డులోని ఓటర్లందరికీ ఐదేండ్లపాటు ఫ్రీగా కటింగ్(Free Haircuts), షేవింగ్ చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ వార్డు ఓటర్లు ఈ అభ్యర్థిని గెలిపిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇటువంటి ఆఫర్లు, హామీలు కనిపిస్తున్నాయి. చీరలు, కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేస్తున్నారట. వార్డు మెంబర్ లేదా సర్పంచ్ పదవి రాజకీయంగా ఎదగాలనుకొనే వారికి మొదటి అడుగు. అందుకే ఈ పదవి మీద అంత మోజు ఉంది. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్నా.. మెజార్టీ పల్లెల్లో మాత్రం పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగానే ఎన్నికలు కొనసాగుతుండటం గమనార్హం. చాలా మంది సర్పంచ్ ఎన్నికల్లో(Panchayat Polls) పోటీ చేసేందుకు హైదరాబాద్ నుంచి పల్లెలకు చేరుకున్నారు. తమ సత్తా చూపించాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Read Also: అందంగా ఉంటే హత్యే.. కొడుకుని కూడా వదలని తల్లి!!
Follow Us On: Pinterest


