మహబూబాబాద్(Mahabubabad) కలెక్టర్ అద్వైత్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మీడియాకు వెల్లడించడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో ఎవరెవరు బరిలో ఉన్నారు? అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. కలెక్టర్ సమాచారాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత గ్రామ పంచాయతీతల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు దాటి 20 గంటలు అయినప్పటికీ కలెక్టర్ సమాచారం ఇవ్వడం లేదని స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా(Mahabubabad) కలెక్టర్ ఎన్నికల నిర్వహణ తీరుపై మండిపడుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, వెంటనే ఈ విషయంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం ఇవ్వాలని జీవో ఉందా? అంటూ కూడా కలెక్టర్ ఫైర్ అయ్యారట. దీంతో స్థానిక ప్రజానిధులు సదరు కలెక్టర్ మీద సీఎస్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Read Also: ‘హిల్ట్’ను అడ్డుకొని తీరుతాం: కేటీఆర్
Follow Us on: Facebook


