epaper
Friday, January 16, 2026
spot_img
epaper

GHMC లోకి 27 అర్బన్ మున్సిపల్ బాడీలు

నగరానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC)లో విలీనమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దానికి కొనసాగింపుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రొసీడింగ్స్ జారీచేశారు. తక్షణం ఆ అర్బన్ మున్సిపల్ బాడీలన్నీ జీహెచ్ఎంసీగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాటి పరిపాలనా బాధ్యతలను కూడా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు, జోనల్ కమిషనర్లకు అప్పగించారు. విలీనమైన 27 మున్సిపల్ బాడీలు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఏ జోన్‌లో, ఏ సర్కిల్‌లో భాగమవుతాయో, వాటికి ఏ అధికారి బాధ్యత వహించాలో, వాటి పర్యవేక్షణ ఎవరు చూడాలో ప్రొసీడింగ్స్ లో పేర్కొన్నారు.

ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లన్నీ GHMC లోకి :

విలీనమైన 27 మున్సిపల్ బాడీల బ్యాంకు అకౌంట్లలోని డిపాజిట్లను జీహెచ్ఎంసీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయాల్సిందిగా సంబంధిత మున్సిపల్ బాడీల స్పెషల్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఆ మున్సిపల్ బాడీల మినిట్స్ పుస్తకాలను సీజ్ చేయాలని, వాటి స్థిర చరాస్తుల వివరాలను జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయాలని, తక్షణం ఆ మున్సిపల్ బాడీల భవనాల నేమ్ బోర్డులను జీహెచ్ఎంసీ పేరుకు మార్చాలని స్పష్టం చేశారు. దీనికి తోడు ఆయా మున్సిపల్ బాడీల పరిధిలోని జనాభా, కుటుంబాలు, ఇండ్ల సంఖ్య, కొనసాగుతున్న పనుల వివరాలు, పెండింగ్ బిల్లుల డీటెయిల్స్.. ఇలా మొత్తం తొమ్మిది రకాల డాక్యుమెంటేషన్ వివరాలను నిర్దిష్టంగా పేర్కొన్న ప్రొఫార్మాలో జీహెచ్ఎంసీకి అందజేయాలని స్పష్టం చేశారు.

ప్రొఫార్మాలోని వివరాలు ఇవే :

GHMC ప్రొఫార్మాలో కమిషనర్ పేర్కొన్న వివరాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు :

• ఆ మున్సిపాలిటీ/కార్పొరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
• దాని విస్తీర్ణమెంత? (చ.కి.మీ.)
• ఏ గ్రేడ్‌కు చెందిన మున్సిపల్ బాడీ కేటగిరీలో ఉన్నది?
• 2001, 2011 సెన్సస్ ప్రకారం స్త్రీ, పురుష, థర్డ్ జెండర్ జనాభా వివరాలు
• ఆ మున్సిపల్ బాడీ పరిధిలోని మొత్తం ఇండ్ల సంఖ్య ఎంత?
• ఎన్ని వార్డులు/డివిజన్లు ఉన్నాయి?
• ఇందులో స్లమ్ ప్రాంతాలుగా నోటిఫై అయినవి?.. కానివి ఎన్ని?
• స్లమ్ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా ఎంత?
• గత మూడు సంవత్సరాలుగా ఆ మున్సిపల్ బాడీల వార్షిక ఆదాయం ఎంత?
• సగటున సంవత్సరానికి అవుతున్న ఖర్చు ఎంత? మూడు సంవత్సరాల వివరాలు విడివిడిగా
• సీసీ రోడ్డు, బీటీ రోడ్లు, మెటల్ రోడ్లు, కచ్చారోడ్లు, వాహనాలు పోవడానికి వీలులేని బాటలు ఎన్ని కి.మీ. మేర ఉన్నాయి?
• పక్కా డ్రైనేజీ కాల్వలు, కచ్చా డ్రైనేజీ కాల్వల పొడవు ఎంత?
• స్ట్రీట్ లైట్లు, హై మాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ స్థంభాలెన్ని? వీటికి వాడే ఎస్వీ లైట్లు, ట్యూబులైట్లు, బల్బులు ఎన్ని?
• మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి వసతికి ప్రధాన వనరులేంటి? నదులు/కాల్వలు/బోరుబావులు లాంటి వివరాలు
• రక్షిత త్రాగునీటి వ్యవస్థ ఉన్నదా? ఆ సౌకర్యం వినియోగించుకుంటున్న ఇండ్లు ఎన్ని? పబ్లిక్ టాప్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి?
• ప్రభుత్వ ఆస్పత్రులు, పబ్లిక్ హెల్త్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య ఎంత?
• ఉన్నత విద్య సంస్థలు, జూనియర్/డిగ్రీ కాలేజీలు, హైస్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్.. ఎన్ని ఉన్నాయి?
• వ్యవసాయ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, స్లాటర్ హౌజ్‌లు, శ్మశానాలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు, ప్లే గ్రౌండ్స్, సరస్సులు/చెరువులు, పబ్లిక్ టాయ్‌లెట్లు, పరిశ్రమలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, డంపింగ్ యార్డులు.. ఇలాంటి వివరాలన్నీ
• ఆయా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు చెందిన పక్కా భవనాలు, వాటి విస్తీర్ణం, ఓపెన్ లాండ్, పార్కుల స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్సులు, విస్తీర్ణం, వాటి ద్వారా వసూలవుతున్న అద్దె.. ఇలాంటి వివరాలు.
• మున్సిపాలిటీ/కార్పొరేషన్‌కు ఉన్న ప్రభుత్వ వాహనాలు (టూ వీలర్ మొదలు ఆటోరిక్షా, వ్యాన్, కారు, జీపు, లారీ…), ఫర్నీచర్.. ఇలాంటివన్నీ
• పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీస్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపొరరీ, డైలీ వేజ్, టైమ్ స్కేల్ స్టాఫ్ వివరాలు.
• మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల ఆస్తులు, ఆదాయం, అప్పులు, పెండింగ్ బిల్లుల వివరాలు.

Read Also: ఆర్ఈసీకి కాళేశ్వరం అప్పు క్లియర్!

Follow Us on: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>