నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం, అధినాయకుడి ఆలస్యం, అదుపులేని కార్యకర్తలు.. కరూర్ తొక్కిసలాట(Karur stampede)లో ప్రధాన పాత్ర పోషించాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు సుదీర్ఘ వివరణతో కూడిన నివేదికను మంగళవారం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. తమిళనాడులోని కరూర్‌లో అక్టోబర్ 13న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగిన పదుల సంఖ్యలో జనం చనిపోవడం తెలిసిందే. దీనిపై సీబీఐ/సిట్‌తో దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో కరూర్ దుర్ఘటన(Karur stampede) వెనక కారణాలను సుప్రీంకు సమర్పించింది. సభకు సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారని, పూర్తి అలసత్వం చూపారని నివేదించింది. అంతేకాదు, ఇందులో టీవీకే అధినేత, సినీ నటుడ్ విజయ్ బాధ్యతారాహిత్యం కూడా ఉందని పేర్కొంది. సభకు ఆయన ఏకంగా ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారని చెప్పింది. ఎక్కువ మంది జనం రావడానికే ఆయన ఇలా చేశారని, అంతకు ముందు తిరుచ్చి, నాగపట్టణం, అరియలూర్ సభలకూ ఆయన ఇలాగే ఆలస్యంగా వచ్చారని నివేదించింది. టీవీకే కార్యకర్తల అదుపులేని తనం కూడా దుర్ఘటన తీవ్రతకు కారణమని పేర్కొంది. 35 డిగ్రీల ఎండలో విజయ్ కోసం జనం ఎదురుచూశారని, ఆయన కాన్వాయ్ వచ్చాక ఒక్కసారిగా అందరూ తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట మొదలైందని చెప్పింది. తొక్కిసలాటను అడ్డుకోవడానికి, అనంతరం బాధితులకు తక్షణ సేవలు అందించడంలో తమిళనాడు పోలీసులు అత్యంత సమర్థంగా వ్యవహరించారని వెల్లడించింది. తమ పోలీసులు విధుల్ని సక్రమంగా నిర్వహించబట్టే విజయ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది.
Read Also: నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ
Follow Us On: X(Twitter)


