ప్రభాస్ (Prabhas) ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇది ఫ్యాన్స్ కు మంచిదే అయినా.. ఇంకో రకంగా బ్యాడ్ న్యూస్ అవుతోంది. ఎందుకంటే కొన్ని సినిమాల లుక్స్ బయటకు రావొద్దనే ఉద్దేశంతో ప్రభాస్ బయట తిరగట్లేదు. అందులోనూ ఇప్పుడు స్పిరిట్ లో నటిస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి ప్రభాస్ కు బోలెడన్ని కండీషన్లు పెట్టేశాడు. స్పిరిట్ లో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందంట. అందుకే మొన్న పూజా కార్యక్రమంలో కూడా ప్రభాస్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేసేదాకా బయట తిరగొద్దని ప్రభాస్ ను కోరాడు సందీప్.
దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. త్వరలోనే ది రాజాసాబ్ (The Raja Saab) ప్రమోషన్లు స్టార్ట్ కావాలి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్ల కోసం ప్రభాస్ (Prabhas) కనిపిస్తాడని ఇన్ని రోజులు ఫ్యాన్స్ సంతోషించారు. కానీ సందీప్ బయట కనిపించొద్దు అంటున్నాడు. సంక్రాంతి లోపు స్పిరిట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ప్రమోషన్లకు ప్రభాస్ రాకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ వస్తే లుక్ లీక్ అయిపోద్ది. ది రాజాసాబ్ కు ఆల్రెడీ కావాల్సినంత బజ్ వచ్చేసింది. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్లకు ప్రభాస్ రాలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా ప్రభాస్ రావాల్సి ఉంటుంది.
సలార్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే.. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే పెద్ద హిట్ చేసుకున్నాడు డార్లింగ్. ఇప్పుడు రాజాసాబ్ కు అలాంటి ప్లానే రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ రాకపోయినా బజ్ కు లోటు లేదు కాబట్టి బయట కనిపించకుండా.. కుదిరితే ఓ ఆడియో లాంటిది ఏమైనా వదులుతారేమో చూడాలి. మొత్తానికి సందీప్ దెబ్బకు ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారన్నమాట.
Read Also: రాజమౌళిని సేవ్ చేసిన పవన్ కల్యాణ్..!
Follow Us On: X(Twitter)


