తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాము ఎంత మొరపెట్టుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని.. ఇక్కడి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నేలమట్టం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(Ramchander Rao) కౌంటర్ ఇచ్చారు. తాము అన్ని రాష్ట్రాలకు సకాలంలోనే నిధులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీని రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరని.. ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజమే భూస్థాపితం చేస్తుందని విమర్శించారు. దేశంలోని ఏ నగరానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? కేంద్రాన్ని అడిగి ఫ్యచర్ సిటీ కడుతున్నారా? అంటూ ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్(National Herald) కుంభకోణం సుప్రీంకోర్టు ద్వారానే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ కేసుకు బీజేపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి చేసిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేశారు. దీంతో బీజేపీ ఆయనకు కౌంటర్ ఇచ్చింది.
Read Also: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం!
Follow Us On: X(Twitter)


