మొత్తానికి రాజమౌళిని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సేవ్ చేసేశాడు. అదేంటి రాజమౌళిని పవన్ కల్యాణ్ ఎలా సేవ్ చేశాడు అని ఆశ్చర్యపోకండి. మనకు తెలిసిందే కదా.. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై రాజమౌళి (Rajamouli) చేసిన కామెంట్స్ ఎంత పెద్ద రచ్చ అయ్యాయో. ఏకంగా కేసులు కూడా పెట్టారు. బీజేపీ, హిందూ సంఘాలు, హనుమంతుడి భక్తులు రాజమౌళిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన సినిమాలను బ్యాన్ చేస్తామన్నారు. రాజమౌళి వివాదం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. కానీ ఆయన మాత్రం దానిపై స్పందించలేదు. ఇప్పటికీ ఆయన మీద విమర్శలు వస్తున్న టైమ్ లో.. పవన్ కల్యాణ్ ఎంటర్ అయ్యారు.
కోనసీమ(Konaseema) కొబ్బరి తోటలకు తెలంగాణ ప్రజల దిష్టి తగలడం వల్లే ఎండిపోయాయని పవన్ చేసిన కామెంట్స్ పై రచ్చ జరుగుతోంది. రాజమౌళి కంటే పవన్ పెద్ద సెలబ్రిటీ. పైగా రెండు రాష్ట్రాల సెంటిమెంట్ ఇష్యూను టచ్ చేశాడు. ఇంకేముంది ఇప్పటి దాకా రాజమౌళిని తిట్టిన వారు, ట్రోల్స్ చేసిన వాళ్లు, మీమర్స్, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం పవన్ కల్యాణ్ మీద పడిపోయింది. పైగా ఇటు తెలంగాణ వాదులు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇంత మంచి స్టఫ్ దొరికాక అందరూ పవన్ (Pawan Kalyan)ను టార్గెట్ చేయకుండా ఉంటారా. అందుకే రాజమౌళి కాంట్రవర్సీ సైడ్ అయిపోయి పవన్ కాంట్రవర్సీ హైలెట్ అవుతోంది. పైగా రాజమౌళి వివాదం ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్న టైమ్ కు పవన్ మ్యాటర్ తెరమీదకొచ్చింది. అందుకే పవన్ వివాదంలో రాజమౌళి పేరు కొట్టుకుపోయింది. రాజమౌళిని ఎంత మంది విమర్శించినా నోరు మెదపలేదు.. క్షమాపణలు చెప్పలేదు. మరి పవన్ కూడా అలాగే చేస్తాడా. లేదంటే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి స్పందించి క్షమాపణ చెబుతాడా అన్నది వేచి చూద్దాం.
Read Also: టార్గెట్ పవన్ కల్యాణ్.. కాంగ్రెస్ నేతల ప్లాన్ ఇదేనా?
Follow Us On: instagram


